రావికంపాడుకు పయనమైన విజయమ్మ

గన్నవరం, 16 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం మధ్యాహ్నం  గన్నవరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన ఆమె శ్రీమతి షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు రావికంపాడు వెళ్లనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రావికంపాడుకు ఆమె రోడ్డు మార్గంలో బయల్దేరారు. నేడు శ్రీమతి షర్మిల పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరనున్న విషయం తెలిసిందే.

వెంకటాపురం నుంచి షర్మిల పాదయాత్ర
చింతలపూడి: దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారానికి  150వ రోజుకు చేరింది. గురువారం ఉదయం ఆమె చింతలపూడి మండలం వెంకటాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. బోరంపాలెం, వల్లంపట్ల, మల్లుకుంట, మహాలక్ష్మీపురం మీదగా ఆమె రావికంపాడు చేరుకుంటారు.  రావికంపాడు దగ్గర మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని దాటుతుంది. ఈ సందర్భంగా అక్కడ 24 అడుగుల వైయస్ఆర్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరిస్తారు. మరోవైపు షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రావికంపాడుకు బయల్దేరి వెళ్ళారు.

Back to Top