రానున్నది రాజన్న స్వర్ణ యుగం

ఏలేశ్వరం:

రానున్నది రాజన్న స్వర్ణ యుగమని వైయస్ఆర్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పేర్కొన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న జనాదరణతో అన్ని పార్టీలూ బెంబేలెత్తిపోతున్నాయన్నారు. ఏలేశ్వరం మాజీ సర్పంచ్ అలమండ చలమయ్య ఆదివారం మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆయనకు చిట్టబ్బాయి, వరుపుల పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పట్టణ కన్వీనర్ బంటుపల్లి పోతన్న అధ్యక్షతన ఏర్పాటైన సభలో చిట్టబ్బాయి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ఆధునికీకరణ పనులు జనవరి 30లోగా చేపట్టకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ వ్యవసాయంపై అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టకరమని అన్నారు.

Back to Top