రానున్నది రాజన్న రాజ్యమే

రామచంద్రాపురం:

రానున్నది రాజన్న రాజ్యమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు నర్రా భిక్షపతి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా పటాన్‌చెరుకు చెందిన విద్యార్థులు రామచంద్రాపురంలో భిక్షపతి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు.  విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యాభివృద్ధి కోసం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. విద్యార్థుల సమస్యలపై కేవలం తమ పార్టీయే పోరాడుతోందని చెప్పారు. పార్టీ అధినేత శ్రీ వైయస్  జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యం తో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకురాలు శ్రీమతి షర్మిల పాదయాత్రకు తెలంగాణలోనూ మంచి స్పందన వస్తుందన్నారు. అలాగే, పటాన్‌చెరు మండలం పటేల్‌గూడకు చెందిన బీజేపీ కార్యకర్తలు శుక్రవారం పార్టీలో చేరారు. రామచంద్రాపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సి.అంజిరెడ్డి ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు.

Back to Top