రాజన్న రాజ్యం సీడీ ఆవిష్కరణ

మేడిపెల్లి:

రాజన్న రాజ్యం పేరుతో ప్రముఖ కవి, గాయకుడు ఓరుగంటి శేఖర్ రూపొందించిన ఆడియో సీడీని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆది శ్రీనివాస్, తీగల రవీందర్ గౌడ్ మేడిపల్లిలో ఆవిష్కరించారు. మొత్తం నాలుగు పాటలున్న ఈ సీడీ స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డిని జ్ఞప్తికి తెచ్చింది. పాటల రచన, స్వరకల్పన చేసిన ఓరుగంటి శేఖర్, సంగీతం సమకూర్చిన జి.ఎల్.నామ్‌దేవ్‌లను వా రు అభినందించారు. జిల్లాలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.  పోరుమల్ల, గుండ్లపల్లి, వల్లంపెల్లిలలో పార్టీలో చేరిన వారినుద్దేశించి ఆ యన మాట్లాడారు. భవిష్యత్తు తమ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయిని ప్రస్తుతం వెంటిలేటర్‌పై కొనవూపిరితో ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ప్రజలు మళ్లీ రాజన్న పాలన రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తుపాను తాకిడికి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం చెల్లించాలన్నారు. పత్తిని రూ.5 వేల మద్దతుధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుపడదన్నారు.

Back to Top