నవరత్నాలతో అధికార పార్టీలో గుబులు

- వైయస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి అగిలే శంకర్‌రెడ్డి
తాడిమర్రి: వైయస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలైన ‘నవరత్నాలు’తో అధికార పార్టీలో గుబులు పట్టుకుందని వైయస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి అగిలే శంకర్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ ధర్మవరం నియోజక వర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరంలో చేపట్టిన నవరత్నాల సభకు మండల నాయకులు, కార్యకర్తలతో వెళ్లారు. ఆయన మాట్లాడుతూ యువనేత జగన్‌ చెప్పిన పథకాలను కాపీ కొట్టిన అధికార పార్టీ ఆ పథకాలను ఇప్పుడే అమలు చేస్తోందన్నారు. ఇందుకు ఉదాహరణ బెల్టుషాపులే నిదర్శమన్నారు. టీడీపీ అధికారంలోకొచ్చిన అనంతరం గ్రామ గ్రామానా రెండు, మూడు బెల్టు షాపులు జరుపుకునేలా టీడీపీ కార్యకర్తలకు అవకాశం ఇచ్చి మందు ఏరులై పారించారన్నారు. బెల్టు షాపులను నిర్మూలిస్తామని జగన్‌ చెప్పడంతో ఆ క్రెడిట్‌ ప్రతిపక్ష పార్టీకి పోతుందని భావించిన చంద్రబాబు.. వెంటనే గ్రామాల్లో బెల్టు షాపులు అరికడతామని చెప్పారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ వడ్డి రామలింగారెడ్డి, గంగులప్ప, జగదానందరెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మహేష్, హనుమంతు, నరíసింహుడు, కృష్ణమనాయుడు తదితరులు వెళ్లారు.

తాజా ఫోటోలు

Back to Top