16న నరసరావుపేటలో భారీ బహిరంగ సభ

గుంటూరు: ఈ నెల 16వతేదీన నరసరావుపేట పట్టణంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తునట్లు నకరికల్లు మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి తెలిపారు. సత్తెనపల్లిలో పార్టీ అనుబంధ సంఘాల కన్వీనర్‌లు, పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ... సత్తెనపల్లి కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్, నాయకులు జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్‌నాయుడు, కాసు మహేష్‌రెడ్డి, పలువురు ప్రముఖ నాయకులు హాజరవుతారని చెప్పారు. 


పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.  ప్రజల సంక్షేమం కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాలకు ఆకర్శితులై పలువురు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారని తెలిపారు. నరసరావుపేట బహిరంగ సభ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.   కార్యక్రమంలో యువజనసంఘం మండల కార్యదర్శి దూదేకుల బాషా, మండల అధికారప్రతినిధి కొణతం అంజిరెడ్డి, ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ మేడా రాంబాబు, మండల ప్రచార కార్యదర్శి వినుకొండ నాగుల్‌మీరా, మాల మహానాడు మండల అధ్యక్షుడు గోదా బాలరాజు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top