బాబు అనైతిక రాజకీయాలపై జనాగ్రహం

సేవ్ డెమోక్రసీ పేరుతో కొవ్వొత్తుల ర్యాలీలు,ఆందోళనలు
పెద్ద ఎత్తున పాల్గొన్న నేతలు, కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులు
బాబు నీచ రాజకీయాలపై మండిపాటు
ఫిరాయింపుదారులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్

అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు అనైతిక రాజకీయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. బాబు అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా 13 జిల్లాల వ్యాప్తంగా వైఎస్సార్సీపీ సేవ్ డెమొక్రసీ పేరుతో అన్ని జిల్లా కేంద్రాల్లో  కొవ్వుత్తుల ర్యాలీలు చేపట్టింది. పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ఈఆందోళనలో పాల్గొన్నారు. కోట్లాది రూపాయలు, మంత్రి పదవులు ఎరచూపుతూ చంద్రబాబు వైఎస్సార్సీపీ  ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పుతున్న వైనంపై మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయాలన్న చంద్రబాబు ఆటలు సాగవన్నారు. 

చంద్రబాబు బ్లాక్ మనీ సొమ్ములకు ఆశపడి వెళుతున్న....ఫిరాయింపుదారులంతా  పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ బిక్ష పెట్టిన అధ్యక్షులు వైఎస్ జగన్ ను వదిలి వెళుతున్న వీరు...రేపు భార్యాపిల్లలను మోసం చేయరని నమ్మకమేంటని ప్రజలు, ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను చూసి యావత్ ప్రజానీకం అసహ్యించుకుంటుందని ...బాబుకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. టీడీపీకి,  ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని నేతలు స్పష్టం చేశారు.

చంద్రబాబు ఎంగిలి మెతుకుల కోసం వెళుతూ....నియోజక అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరమన్నారు. బాబు ఏం అభివృద్ధి చేశాడని పోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.  ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చని చంద్రబాబు...దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి నీచ కార్యక్రమాలు చేస్తున్నారని ఫైరయ్యారు. రాజ్యాంగానికి  విరుద్ధంగా పాలన సాగిస్తున్న బాబుకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. 
Back to Top