తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం దారుణం
- నిందితుడిని ఎందుకు అరెస్టు చేయ‌లేక‌పోతున్నారు
- చంద్ర‌బాబు పాల‌న‌లో ర‌క్ష‌ణ క‌రువు
- రాజ‌ధాని ప్రాంతంలో అత్యాచార ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం దారుణం
- చంద్ర‌బాబే స్వ‌యంగా సెటిల్‌మెంట్లు చేస్తున్నారు

గుంటూరు : తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేయ‌డం దారుణ‌మ‌ని  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌మండిప‌డ్డారు. దాచేప‌ల్లిలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. నిందితుడిని అరెస్టు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. గుంటూరు దాచేపల్లిలో జరిగిన ఈ దారుణంపై  పార్టీ నాయ‌కులు ఎమ్మెల్యే ముస్త‌ఫా, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డిలు మండిప‌డ్డారు.  తొమ్మిదేళ్ల అమ్మాయిని చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది.  దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.  బాధితురాలి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అండగా నిలిచారు.వాసిరెడ్డి ప‌ద్మ మాట్లాడుతూ..గుంటూరు జిల్లాలో 20 అత్యాచార ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. రాజ‌ధాని ప్రాంతంలో అత్యాచార ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం దారుణ‌మ‌న్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని విమ‌ర్శించారు. నిందితుడిని ఎందుకు అరెస్టు చేయ‌డం లేద‌ని ఆమె మండిప‌డ్డారు.

తాజా వీడియోలు

Back to Top