ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నిరసన

తూర్పుగోదావరి(మామిడికుదురు): ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పార్టీ శ్రేణులు తీవ్రంగా నిరసన తెలిపాయి. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పార్టీ శ్రేణులు మండల రెవెన్యూ కార్యాలయాల మెట్లపై భైఠాయించి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో పి.గన్నవరం కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారులను రెచ్చగొట్టిన ప్రభుత్వం వైయస్‌ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. ఆ కేసులను వెంటనే వాపసు తీసుకుని వైయస్‌ జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ నేతలు అధికారులపై దాడులకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోని ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి కుట్రకు పాల్పడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకుడిపై అక్రమ కేసు బనాయించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రెవెన్యూ కార్యాలయంలో అందజేశారు. ఈ ఆందోళనలతో పార్టీ నాయకులు జక్కంపూడి వాసు, తోరం సూర్యభాస్కర్, గెడ్డం కృష్ణమూర్తి, యూవీవీ సత్యనారాయణ, జగతా అరుణ్, జోగి వెంకటరామకృష్ణ, కొమ్ముల రాము, కొమ్ముల కొండలరావు, నల్లమిల్లి గోవిందరెడ్డి, గెడ్డం వెంకటేశ్వరరావు, నెల్లి దుర్గాప్రసాద్, చిక్కం బుజ్జిబాబు, కుసుమ పెరుమాళ్లకుమార్, పిల్లి శ్రీనివాస్, పొలమూరి గోపాల్, బయ్యా తాతాజీ, మోకా విజయరాజు, గూటం శ్రీనివాస్, యనమదల సత్యనారాయణ, పాటి త్రిమూర్తులు, కొమ్ముల బుజ్జి, కొమ్ముల సూరిబాబు, గంధం రాముడు, రొక్కం వెంకటేశ్వరరావు, నయినాల అబ్బాస్, రొక్కాల వెంకట్రావు, ముత్యాల నర్సింహారావు, నక్కా బాలకృష్ణ, నీతిపూడి చంద్రరావు, కొనుకు నాగరాజు, వాసంశెట్టి రామకృష్ణ, పెండ్యాల అచ్చిబాబు, అన్వర్‌ తాహిర్‌హుస్సేన్, అక్బర్‌ అలీ, మజహర్‌ అలీ, ఎండీ జమా, యనమండ్ర లక్ష్మణరావు, కాండ్రేగుల శ్రీను, లంకే ఏసు, గెడ్డం గంగాధర్, కారుపల్లి శ్రీనివాస్, నేరేడుమిల్లి శ్రీను, కొమ్మూరి వీరరాఘవరాజు, గుబ్బల నాగరాజు, పొన్నమండ శ్రీను, గెడ్డం విష్ణుమూర్తి, మేడిది కిరణ్, పినిశెట్టి శేఖర్, తోట రామకృష్ణ, నాగాబత్తుల శ్రీకృష్ణ, విప్పర్తి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Back to Top