ప్రొఫెసర్లపై కక్షసాధింపుకు నిరసనగా ఏయూ బంద్..!

విశాఖపట్నంః విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఇవాళ ఆంధ్రాయూనివర్సిటీలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేకహోదా సాధన కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచినందుకు ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన యువభేరి సదస్సులో ప్రత్యేకహోదాను డిమాండ్ చేసినందుకు ప్రసాద్ రెడ్డి, అబ్బులులకు ఏయూ ఉన్నతాధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్లపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ  విద్యార్థి సంఘాలు ఏయూ బంద్ కు పిలుపునిచ్చాయి.

Back to Top