కరువు సీమలో కష్టాలు

కర్నూలుః  కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో తాగడానికి నీళ్లు కూడా రావని అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా కింద పంటలసాగు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. రాయలసీమ ప్రజలు ఇప్పటికే కరువుతో అల్లాడుతున్నారని, నీళ్లు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెప్పారు. కర్నూలులో వైయస్ జగన్ దీక్ష సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు.


Back to Top