ఎమ్మెల్యే రోజాకు సభా హక్కుల సంఘం నోటీసులు

హైదరాబాద్) ఎమ్మెల్యే రోజా కు శాసనసభ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న హాజరు కావాలని విచారణకు హాజరు కావాలని సూచించింది. ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీని మీద శాసనసభ హక్కుల సంఘం విచారణ చేపట్టింది. అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటూ ఉండటంతో ఆమె విచారణకు హాజరు కాలేక పోయారు. ఈ విషయాన్ని లిఖిత పూర్వక సమాచారం అందించారు. దీంతో ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా సంఘం సూచించింది. మరో వైపు, రోజా వేసిన పిటీషన్ మీద సుప్రీం కోర్టు సోమ వారం విచారణ చేపట్టనుంది. 
Back to Top