ఎదురు లేని మనిషి జననేత జగన్ అన్నతూర్పు గోదావ‌రి:  నిరంతరం ప్ర‌జ‌ల కోసం శ్ర‌మిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎదురు లేని మనిషి అని హీరో హ‌రికృష్ణ పేర్కొన్నారు. 
 ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ పాద‌యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ ఎంతో బిజీగా వున్నా కూడా ఆడియోను విడుదల చేయటం నా జీవితంలో మరచిపోలేని విషయమ‌ని హీరో హ‌రికృష్ణ పేర్కొన్నారు. వైయ‌స్ జగన్‌కు ఎంతో రుణపడి ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు. జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ  జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్‌కి రెడీ అయ్యింది. వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జ‌న‌నేత  కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని మనిషి జననేత జగన్ అన్న’ అనే ప్రత్యేక గీతాన్ని రూపొందించారు.  ఆ పాటను వైయ‌స్ జగన్  చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా... చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘వైయ‌స్ జగన్ గారి అభిమాని అయిన మా హీరో హరి కోరిక మేరకు ఎదురు లేని మనిషి జననేత జగనన్న అనే పాటను చేయడం జరిగింద‌న్నారు.  ఈ పాట ప్రతీ వైయ‌స్ఆర్ అభిమాని, వైయ‌స్‌ జగన్‌ను  ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా రూపొందించడం జరిగింది. ఈ పాట సీడీలను వైయ‌స్ జగన్ గారు ఆవిష్కరించి మా హీరో హరిని చిత్ర యూనిట్ ను అభినందించార’ని తెలిపారు.

హీరో హరి మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్ గారు విడుదల చేసిన మా సినిమా ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఆయన  ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న నా అభిమాన నాయకుడికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలి అనుకొని ఆ ప్రజా నాయకుడి మీద ఓ పాట రూపొందించే ఆలోచన వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక గీతాన్నిరూపొందించాం. త్వరలోనే మా సినిమాతో మీ ముందుకు వస్తున్నాను.. ప్రేక్షకులు నా ప్రయత్నాన్ని మెచ్చి నన్ను దీవిస్తారు అని ఆశిస్తున్నా’ అని తెలిపారు.


Back to Top