ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతినాయకుడు

ఫిరంగిపురం(గుంటూరు)

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేత కాదనీ ప్రతినాయకుడనీ శ్రీమతి వైయస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో శ్రీమతి వైయస్ షర్మిల ప్రసంగించారు. తొలుత కొండవీడులో ఆమె పాదయాత్రను ప్రారంభించారు. వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. జైజగన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని ఆమె చెప్పారు. రైతులను పట్టించుకున్న ప్రభుత్వమే లేదన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వమని టీడీపీ నిస్సిగ్గుగా చెబుతోందని విమర్శించారు. ప్రజల కష్టాలను చంద్రబాబు రెప్పార్పకుండా చూస్తున్నారని ధ్వజమెత్తారు.  చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని వ్యాఖ్యానించారు. మోపాలతో, కుట్రలతో జగనన్నను జైలుపాలుచేశారు. బోనులో ఉన్నా సింహం సింహమేనని శ్రీమతి షర్మిల శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పారు.

Back to Top