క‌ల‌సి న‌డ‌వాల‌ని..కష్టాన్ని చెప్పుకోవాలని..


- స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు 
 - అధినేత‌తో క‌లిసి అడుగులు వేస్తున్న పార్టీ నాయ‌కులు


కర్నూల్‌ : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. జ‌న‌నేత ఏ గ్రామానికి వెళ్లినా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. రాజ‌న్న బిడ్డ వ‌స్తున్నార‌ని ఎదురెళ్లి స్వాగ‌తాలు ప‌లుకుతున్నారు. దారి పొడువునా త‌మ క‌ష్టాలు చెప్పుకుంటున్నారు. అలాగే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు. అభిమాన నేతతో కలిసి నడవాలని..కష్టాన్ని చెప్పుకోవాలని.. సంక్షేమ పథకాలు అందని తీరును వివరించాలని.. సుదూర ప్రాంతాల నుంచి  సైతం ప్రజలు భారీఎత్తున తరలివస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఇవాళ ప‌త్తికొండ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. ఇక్క‌డి నుంచి రాతన, తుగ్గలి, గిరిగట్ల మీదుగా నేడు మదనంతపురం క్రాస్‌ వరకు యాత్ర కొనసాగనుంది.  

రాత‌న గ్రామంలో ఘ‌న స్వాగ‌తం
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా రాత‌న గ్రామానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జగన్‌ ప్రజలను ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. 

అధినేత వెంటే..
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు పార్టీ నేత‌లు తోడుగా నిలుస్తున్నారు. శ‌నివారం ఉద‌యం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, పుష్పవాణి, ఎమ్మెల్సీ ఆళ్లనాని, అరకులోయ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిశారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ పాదాలకు బొబ్బ‌లు తీయ‌డంతో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాళ్లు నొప్పులు బాధిస్తున్నా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప‌డుతున్న ఆరాటాన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు.

బుడ‌గ జంగాలకు న్యాయం చేస్తాం
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక బుడ‌గ జంగాల‌కు న్యాయం చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. శ‌నివారం వైయ‌స్ జ‌గ‌న్‌ను బుడగ జంగాలు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. జీవో నంబర్ 144 రద్దు చేయించాలని వారు కోరారు.  ఈ విషయమై ఇది వరకే అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని వివ‌రించారు. 

Back to Top