<strong>అనపర్తి (తూర్పు గోదావరి జిల్లా) :</strong> మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. అనపర్తి మండలం రామవరానికి చెందిన వైయస్ వీరాభిమాని కర్రి గాంధీరెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్ విగ్రహాన్ని బోస్ శనివారం ఆవిష్కరించారు. దేశంలో ఎంతమంది నాయకులున్నా ప్రజల గుండెల్లో కొలువైనవారు కొద్ది మందే అని, అలాంటి వారిలో మహానేత వైయస్ ఒకరని అన్నారు. మహానేత వైయస్‌ను ప్రజలు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో చెప్పడానికి గాంధీరెడ్డి తన ఇంటిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడమే నిదర్శనమన్నారు.<br/>గాంధీరెడ్డి మాట్లాడుతూ, తాను మహానేత డాక్టర్ వైయస్ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని వెల్లడించుకునేందుకే ఫైబర్తో తయారుచేసిన నాలుగడుగుల ఆయన విగ్రహాన్ని తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. మహానేత వైయస్ విగ్రహానికి నిత్యం పూజ చేసి స్మరించుకుంటానన్నారు.