ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం..!

మండుతున్న ధరలు, పెరిగిన ఛార్జీలు, ఎండిన పంటలతో రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్ధమైంది. ప్రజలు, రైతుల పక్షాన పోరాడేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా వైఎస్సార్సీపీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నవంబర్ 2న పార్టీ వినియోగదారులతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టాలని నిర్ణయించింది.

అదేవిధంగా నవంబర్ 3 లేదా 4న ప్రభుత్వాన్ని నిలదీస్తూ పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో రైతులను పరామర్శించేందుకు అక్కడ పర్యటించనున్నారు .ఈమేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. 

తాజా వీడియోలు

Back to Top