ప్రజా సంకల్పయాత్ర @1900 కి.మీ.

కృష్ణా: వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర ఆదివారం ఉదయం 1900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. 148 వ రోజు పామర్రు నియోజకవర్గంలో ప్రవేశించిన పాదయాత్ర తాడంకి వద్ద ఈ మైలురాయిని దాటింది . ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ గ్రామంలో మొక్కను నాటి పార్టీ  జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు గ్రామస్తులు వైయస్ జగన్ కు భారీ స్వాగతం పలికారు. ఊరు ఊరంతా సందడి నెలకొంది. జై జగన్ నినాదాలు పెక్కుటిల్లాయి. 

గత నవంబర్‌ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర ఏడు జిల్లాల్లో పూర్తి అయి ప్రస్తుతం 8 వ జిల్లా కృష్ణా జిల్లాలో ప్రతిహతంగా ముందుకు సాగుతోంది. 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఇప్పటివ‌ర‌కూ వైఎస్సార్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి అయ్యింది.
Back to Top