ప్రచార కమిటీ సభ్యుల నియామకం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులనూ, నలుగురు కన్వీనర్లనూ నియమిస్తూ కమిటీ రాష్ట్ర సమన్వయకర్త టి.ఎస్. విజయ్ చందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట శేఖర్ రెడ్డి(నల్గొండ), జి. వెంకటరెడ్డి(పశ్చిమ గోదావరి), నేలకుదురు వసుంధర(తూర్పు గోదావరి), కె.వి.ఎల్. శాంతి(రాజమండ్రి), జె. సీతయ్య(ఖమ్మం), ఉప్పాటి ప్రసాదరెడ్డి(ఖమ్మం) అను కమిటీ సభ్యులుగా నియమించారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్(నల్గొండ), డా వై. వెంకట రమణ(రాజమండ్రి), రావూరి వెంకటేశ్వరరావు(తూర్పుగోదావరి), శీలం వెంకటరెడ్డి(ఖమ్మం) లను ఆయా ప్రాంతాల ప్రచార కమిటీ కన్వీనర్లుగా నియమిస్తున్నట్లు విజయ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు.

Back to Top