ప్రారంభమైన షర్మిల 159వ రోజు పాదయాత్ర

ఉండి, 25 మే 2013:

మరో ప్రజాప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన దివంగత మహానేత డాక్టర్  వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి  వైయస్ షర్మిల  శనివారం ఎన్ఆర్పీ అగ్రహారం నుంచి తన యాత్రను ప్రారంభించారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర మహదేవపట్నం అడ్డరోడ్డు, నరసింహపురం, భీమవరంలోని ఉండి రైల్వేగేటు, పాత బస్టాండ్, ప్రకాశం చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా  రాత్రికి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీకి చేరుతుంది. భీమవరంలోని ప్రకాశం చౌక్‌లో ఏర్పాటయ్యే బహిరంగ సభలో  శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ఆమె పాదయాత్ర చేపట్టి శనివారానికి 159వ రోజుకు చేరుకుంది.

Back to Top