'ప్రాణహిత' పైలాన్‌కు విజయమ్మ పాలాభిషేకం

తుమ్మిడిహెట్టి(ఆదిలాబాద్) 21 మే 2013:

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్  విజయమ్మ మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. తుమ్మిడి వద్ద భూమి పూజకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ నెలకొల్పిన పైలాన్‌కు ఆమె పాలాభిషేకం చేశారు. మొక్కలు నాటారు. ఆమె పాలాభిషేకం చేస్తున్న సమయంలో జోహార్ వైయస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు వెల్లువెత్తాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంతకుముందు కౌటాలలో  టోంకిని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూలే, కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

Back to Top