టీడీపీ "కాల్ మనీ" సెక్స్ రాకెట్

కాల్ మనీ ముసుగులో టీడీపీ నేతల దందా
మహిళలకు వల.. బలంవంతంగా వ్యభిచారం
పోలీసుల అదుపులో 12 మంది నిందితులు..పరారీలో మరికొందరు
ముఠాలో బడా వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు
వడ్డీసొమ్ముతో విదేశాల్లో జల్సా చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే 
ఎమ్మెల్యే వెంట కాల్ మనీ ముఠా సూత్రధారి
పోలీసులపై పెరుగుతున్న ఒత్తిళ్లు

విజయవాడః టీడీపీ నేతల పైశాచికత్వం పరాకాష్టకు చేరింది. కాల్ మనీ పేరుతో అమాయక మహిళలు, విద్యార్థులకు వలవేసి  పచ్చచొక్కాలు విజయవాడలో అమానుష క్రీడకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్లను ఆసరాగా చేసుకొని కాల్ మనీ పేరిట బలవంతపు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారం ముసుగులో కాల్ మనీ (అధికవడ్డీకి అప్పులివ్వడం)పేరుతో  మహిళలను సెక్స్ రొంపిలోకి దింపుతున్న తెలుగుతమ్ముళ్ల బండారాన్ని విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు  పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.  అప్పుతీసుకున్న మహిళలను లైంగికంగా వేధిస్తూ వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ పచ్చబాబులు అడ్డంగా దొరికిపోయారు. 

అమాయక మహిళలతో నీచ వ్యాపారం
గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీకి ప్రయత్నించిన ఎలక్ర్టికల్ డీఈ సహా మరికొందరు పరారీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఒకరికి ఇందులో ప్రత్యక్షంగా ప్రమేయం ఉండగా, అనేకమంది తెలుగుదేశం నేతలకు సెక్స్ రాకెట్ లో సన్నిహిత భాగస్వామ్యం ఉండడం గమనార్హం. పై స్థాయి నుంచి ఒత్తిళ్లతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పేరును పోలీసులు ఎఫ్ ఐఆర్ లో చేర్చలేదు. ముఠాలో బడా వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వడ్డీసొమ్ముతో విదేశాల్లో జల్సా చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రెండు రోజుల్లో నగరానికి రానున్నారు. ఎమ్మెల్యే వెంట కాల్ మనీ ముఠా సూత్రధారి ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులకు దిగ్ర్భాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. 

మనీ ముసుగులో సెక్స్ దందా
విజయవాడ పటమట పంటకాల్వ రోడ్డులో అధికార పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న యలమంచిలి శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయం నడుపుతున్నాడు. కొందరు టీడీపీ  ప్రజాప్రతినిధులు తమ డబ్బులను ఇతని ద్వారా వడ్డీలకు తిప్పుతున్నారు. ఇతనితో పాటు మరికొందరు కూడా ఇక్కడి నుంచే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. రక్షణ కోసం బౌన్సర్లను పెట్టుకున్నారు. ఆర్థిక అవసరాల నుంచి బయటపడేందుకు అప్పు కోసం వచ్చే మహిళలను లోబర్చుకంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకొని నూటికి రూ. 10 నుంచి రూ.25 వడ్డీకి ఇస్తున్నారు. ఆతర్వాత అప్పు తీర్చలేకపోతే వారిని బలవంతంగా లొంగదీసుకని తమ లైంగిక వాంఛలను తీర్చుకోవడం పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు పంపుతున్నారు. 

టీడీపీ నేతల రాక్షస క్రీడ
రహస్యంగా వీడియోలు తీస్తూ...ఎవరికైనా చెబితే బయటపెడతామంటూ బెదిరిస్తూ బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. వీరినే కాకుండా పరిసర ప్రాంతాల్లోని అందమైన మహిళలను, విద్యార్థులను తీసుకురావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. విధిలేని స్థితిలో పలువురు మహిళలు వీరు చెప్పిందల్లా చేసినట్లు తెలిసింది. వీరి బారిన పలువురు విద్యార్థినులు కూడా పడ్డారు.  ఈక్రమంలోనే ఓ మహిళ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ ను కలిసి తమ కన్నీటిగాథను చెప్పుకుంది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోదిగిన టాస్క్ ఫోర్స్ శ్రీరామ్, దూడల రాజేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నుపాటి శ్రీను అనే మరో కీలక వ్యక్థిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. కేసులో నిందితులుగా ఉన్న వారందరూ నగరం పరిసర ప్రాంతాల్లోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు. 

ప్రజలు, ప్రతిపక్షాలు, మహిళాసంఘాల ఆగ్రహం..
విజయవాడ టాస్క్ ఫోర్స్ దాడి చేసి ఈముఠాకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము, భవానీ శంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, ఎం సత్యానంద్, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్ పై పటమట పీఎస్ లో సెక్షన్ 420,376,354ఎ(1),(2), 384, 506 , రెడ్ విత్ 34, 120 (బి) ఐసీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే  కొందరు ప్రజాప్రతినిధులు వదలాలంటూ పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మరికొందరు ఉన్నతస్థాయి అధికారులు కూడా పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చారంటే వీరినీచ దందా ఏవిధంగా సాగుతుందో అర్థమవుతోంది.  తీగ లాగితే తెలుగుతమ్ముళ్ల డొంకంతా కదులుతోంది. టీడీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేతల రాక్షసక్రీడపై నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరపించి, దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రజలు, మహిళాసంఘాలు, ప్రతి పక్షాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top