అడ్డుకుంటారన్న భయంతోనే అరెస్ట్

అనంతపురం: చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎస్కేయూలో విద్యార్థిసంఘం నేత లింగారెడ్డి సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం సభను అడ్డుకుంటారన్న భయంతోనే వీరిని అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ నియంత పాలన సాగిస్తున్నారు. ఈక్రమంలోనే విద్యార్థులు చంద్రబాబును నిలదీస్తారన్న భయంతో తెలుగుతమ్ముళ్ల ఆదేశాల మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Back to Top