నిరసన మార్చ్ పై ప్రభుత్వం దౌర్జన్యఖాండ..!

వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్..!
ఈడ్చుకెళ్లి చెత్తవ్యాన్ లో కుక్కిన ఖాకీలు..!
ప్రభుత్వతీరుపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం..!

విజయవాడః ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ... విజయవాడలో వైఎస్సార్సీపీ  తలపెట్టిన నిరసన మార్చ్ ను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ కు శాంతియుతంగా వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకొని దారుణంగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేలు , ఎంపీలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి చెత్త వ్యాన్లలో వేయడంపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

ఇదేనా ప్రజాస్వామ్యం..!
అహింసాపద్ధతిలో ర్యాలీతో వెళుతున్న నాయకులపై పోలీసులు ఓవరాక్షన్ చేశారు. నాలుగు అడుగులు కూడా వేయకుండానే అడ్డుకొని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ తీరును వైఎస్ఆర్ సీపీ నేతలు ఖండించారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం ఆగదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మంత్రులు విమర్శలు మాని...ప్రత్యేకహోదా కోసం ప్రయత్నించాలని సూచించారు. 

ఇదొక  దుర్దినం..చీకటి అధ్యాయం..!
మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలీసుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా కూడా దౌర్జన్యంగా ర్యాలీని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలను, ప్రజాప్రతినిధులను ఏ మాత్రం గౌరవించకుండా పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్ లో ఎక్కించారని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఇదొక దుర్దినం, చీకటి అధ్యాయమని ఉమ్మారెడ్డి అన్నారు.  వైఎస్సార్సీపీ చేపట్టిన మార్చ్ లో సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 
Back to Top