నామినేషన్ దాఖలు చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు మళ్లీ రాజకీయ పునర్జన్మ ఇచ్చారని ఆపార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రజా సంక్షేమంపై పోరాటానికి శాసనమండలిలో వైఎస్ఆర్ సీపీ తరపున తనవంతు పాత్ర పోషిస్తానన్నారు.
Back to Top