ప్ర‌జ‌ల క‌ష్టాలు క‌ళ్లారా చూస్తూ..కన్నీటిని తుడుస్తూ..


- విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
-కావూరు శివారు నుంచి 119వ రోజు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం
- మ‌ధ్యాహ్నానానికి నర్సరావుపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- సాయంత్రం నర్సరావుపేటలో బ‌హిరంగ స‌భ‌

గుంటూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఏడాది న‌వంబ‌ర్ 6వ తేదీన ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి కాగా, ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో కొన‌సాగుతోంది. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ క‌ళ్లారా చూస్తూ..వారి క‌న్నీరు తుడుస్తూ ముందుకు సాగుతున్నారు. వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం గుంటూరు జిల్లా కావూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కోమిటినేనివారిపాలెం, గంగన్నపాలెం, ఐర్లపాడు, అమీనాషాహెబ్‌ పాలెం, బాసిక్‌ పురం, కేశానుపల్లి మీదగా నర్సరావుపేట వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.   సాయంత్రం నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. 

పోటెత్తుతున్న పాద‌యాత్ర దారులు
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. త‌మ బాధ‌లు చెప్పుకునేందుకు ప్ర‌జ‌లు తండోప‌తండాలు త‌ర‌లివ‌స్తున్నారు. ఏ ఊరికి వెళ్లినా పండుగ వాతావ‌ర‌ణ‌మే. వేసవి ఎండతో పోటీపడుతూ పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. దారులన్నీ జనసంద్రంగా మారుతున్నాయి. తమ అభిమాన నేత వైయ‌స్ జగన్‌తో ఆత్మీయంగా మాట్లాడాలని.. ఆయనతో కరచాలనం చేయాలని... ఫొటో దిగి పదిలంగా దాచుకోవాలని... తమ కష్టాలను చెప్పుకొని భరోసా పొందాలని ప్రజా సంకల్ప యాత్రకు వెల్లువలా తరలి వస్తున్నారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వేసవి ఎండ తీవ్రతతో పోటీ పడుతూ ప్రజలు అంతకంతకూ రెట్టింపవుతూ జన
నేతను అనుసరించి పాదయాత్రగా ముందుకు సాగుతున్నారు. మ‌రో ఏడాది ఆగితే మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, రాజ‌న్న రాజ్యాన్ని మ‌ళ్లీ తెస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇస్తున్నారు. న‌వ‌ర‌త్నాల గురించి  వివ‌రిస్తూ అన్ని వ‌ర్గాల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నారు.
Back to Top