ప్రజల అభిమానమే జననేతను కాపాడుతుంది

కాకినాడ: దేవుడి ఆశీస్సులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమానం ఉన్నంత వరకు వైయస్‌ జగన్‌ ఎవరూ ఆపలేరని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. 2019 ఎన్నికల్లో దేవుడి శాసించాడు.. ప్రజలు ఆశిస్తున్నారు.. ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశంతో సంస్కారం చేసిన చంద్రబాబు జనసేనను ఎంతకు లీజుకు ఇచ్చారో పవన్‌ చెప్పాలన్నారు. సెల్‌ఫోన్‌ రీచార్జ్‌ కార్డులా తయారయ్యాడని, ఎప్పుడు చంద్రబాబు రీచార్జ్‌ చేస్తాడో అప్పుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లుతున్నాడన్నారు. విశాఖపట్నం ఆడపడుచు పవన్‌ కల్యాణ్‌ మొదటి పెళ్లి చేసుకున్నాడు. విడిపోయినప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్లెక్కాయంటే.. రాష్ట్ర ప్రజలకు మీరేం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రెండో భార్యను వదిలేశాడు.. పుస్తకాలు చదువుకుంటుంటే వదిలేశారని చెబుతున్నాడని, కానీ ఆ సోదరీమణి ఏం చెప్పిందో పవన్‌ కల్యాణ్‌కు వినిపించలేదా..? అని నిలదీశారు. స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇంకో మహిళలతో నాకో బిడ్డ పుట్టిందని చెబితే నా ముందు పెడితే ఏ మహిళ అయినా కలిసి జీవించగలదా అని చెప్పిందన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఒక గదిలో కూర్చొని పుస్తకాలు చదువుతుంటే.. పక్క దేశంలో ఉన్న ఆమెకు ఎలా పిల్లలు పుట్టారో చెప్పాలన్నారు. రాష్ట్రం అయిపోయింది. జాతీయం అయిపోయింది. అంతర్జాతీయం నుంచి మూడో భార్యను తీసుకొచ్చావు ఆమెకు అయినా న్యాయం చేయాలని కోరారు. 

ప్రపంచ స్థాయిలోని అత్యంత శక్తివంతమైన యువ నాయకుల్లో మొదటి 20లో నారా లోకేష్‌ ఉన్నారని సర్వే వచ్చిందన్నారు. లోకేష్‌ ఎంతపెట్టి కొనుగోలు చేశారో తెలియదన్నారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని వ్యక్తికి శక్తివంతమైన యువనాయకుల జాబితాలో చేర్చడం ఏంటని ప్రశ్నించారు. తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది వైయస్‌ఆర్‌ సీపీ, రాష్ట్రానికి నాయకత్వం వ హించేది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 
 
Back to Top