వైయస్‌ జగన్‌ను ప్రజలు విశ్వసిస్తున్నారు

 
చిత్తూరు:  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఒక ఉద్యమంలా సాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రజలంతా వైయస్‌ జగన్‌ను విశ్వసిస్తున్నారని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు తీరుతారని ప్రజలు నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. గతేడాది నవంబర్‌ 6వ తేదీన వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదలుపెట్టిన పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో దిగ్విజయంగా సాగుతోందన్నారు. ఈ యాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ అందరికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రస్తుతం వైయస్‌ జగన్‌ పాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సాగుతుందని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కూడా చిత్తూరు జిల్లాలో కో–ఆపరేటివ్‌ షుగర్, డయిరీలు మూతపడుతున్నాయని, వైయస్‌ జగన్‌ సీఎం కాగానే చంద్రబాబు మూతవేసిన వీటిని తెరిపిస్తారన్నారు. తనను కలిసిన రైతులకు, పాడి రైతులకు కూడా జననేత భరోసా కల్పించారని చెప్పారు. లీటర్‌ పాలకు రూ.4 సబ్సిడీ కల్పిస్తామన్నారు.  స్థానిక సమస్యలను కూడా వైయస్‌ జగన్‌ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన వస్తుందన్నారు. పాదయాత్ర అయిన తరువాత బీసీ గర్జన సభలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్‌ చేస్తారని పెద్దిరెడ్డి వివరించారు.
 
Back to Top