వారంతా బాబు జేబులోని మనుషులే

హైదరాబాద్ః  ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన దీక్షపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్  కాంట్రాక్ట్ లు మిథున్ రెడ్డికి కట్టబెట్టారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  20 పర్సంట్ జేవీలు ఇప్పించాం తప్ప ఆ ప్రాజక్ట్ లతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లంతా బాబు జేబులోని మనుషులేనని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారంటూ దేవినేని వైయస్ జగన్ ను విమర్శించడం అర్థరహితమన్నారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తో లాలూచీ పడి ...రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు ఎవరికి తాకట్టు పెడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లపై కేసీఆర్ ను నిలదీయాల్సింది పోయి ...వైయస్ జగన్ దీక్షపై విమర్శలు చేయడం దేవినేని దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

Back to Top