పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, ముస్తాఫా, పార్టీ నేత రావి వెంకట్రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనపై ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top