178వ రోజు ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

గొల్లలమామిడాడ 13 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 178వ రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది.  రామేశ్వరం నుంచి ఆమె తన పాదయాత్రను గురువారం ఉదయం ప్రారంభించారు. అక్కడి నుంచి కొవ్వాడ మీదుగా ఇంద్రపాలెం చేరుకుంటారు. మధ్యాహ్న భోజన విరామానంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారు. అంబేద్కర్‌ భవన్‌ సెంటర్‌, మసీదు సెంటర్‌, జగన్నాధపురం బ్రిడ్జి మీదుగా భావన్నారాయణ సెంటర్‌ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం లక్ష్మి టాకీస్‌ సెంటర్‌, కల్సన సెంటర్‌ వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు.

Back to Top