గూడూరు (చిలకలపూడి) : గ్రామస్థాయిలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వైయస్‌ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము అన్నారు. మండల పరిధిలోని ఆకులమన్నాడు, పోసినవారిపాలెం, కప్పలదొడ్డి, కోకనారాయణపాలెం, ఘంటలమ్మపాలెం, లేళ్లగరువు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను గ్రామస్థాయి నాయకులకు అందజేయటం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితా వారీగా పోలింగ్‌బూత్‌ల వారీ కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనరు బొమ్ము గంగాప్రసాద్ (బాబు), ఎస్సీ సెల్ నాయకులు కారుమంచి కామేశ్వరరావు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మేరుగుమాల వెంకటేశ్వరరావు, పెన్నేరు పిచ్చేశ్వరరావు, ఆకుల వీరాంజనేయులు, నాగాంజనేయులు, జి శివయ్య, చింతల శ్రీనివాస్, సిరివెళ్ల భాస్కరరావు పాల్గొన్నారు.<br/>