అభివృద్ధే లక్ష్యం

కృష్ణా జిల్లా:  నూజివీడు పట్టణంలోని అంతర్గత రహదారులన్నింటిని  సిమెంట్‌ రోడ్డులుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామ‌ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. పదమూడవ ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్స్, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు, స్టేట్‌ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నిధులతో ఆకుల దుర్వాసరావు రోడ్డు, 12వ వార్డులో సిమెంట్‌ డ్రైనేజీ, సిమెంట్‌ రోడ్డు, గంగాధర్‌రావు ఆసుపత్రి రోడ్డు, మొఘల్‌ చెరువు రోడ్డులను ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏ మున్సిపాలిటీలో జరగని విధంగా నూజివీడు మున్సిపాలిటీలో సిమెంట్‌ రహదారులను దాదాపు 95శాతం పూర్తిచేయడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలోని విద్యుత్‌ స్తంభాలన్నింటికీ  ఎల్‌ఈడీ లైట్లు అమర్చడం జరిగిందన్నారు. ఎమ్మార్‌ అప్పారావు కాలనీలోని రోడ్లను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బసవా రేవతి, వైస్‌చైర్మన్‌ అన్నే మమత, కోఆప్షన్‌ సభ్యులు బసవా భాస్కరరావు, ప్రతిపక్ష ఫ్లోర్‌లీడర్‌ చెరుకూరి దుర్గాప్రసాద్, కౌన్సిలర్లు ఇరవా విజయలక్ష్మీ, మానూరి ప్రసాద్, మద్దాల రూత్‌మెర్సీ, కొలుసు శోభనాచలపతిరావు, తవిడిశెట్టి అశోక్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు పిళ్లా చరణ్, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ మల్లిఖార్జునరావు, డిఈ పసుపులేటి పోలీస్, ఏఈ స్వాతి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీపీ తొమ్మండ్రు శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు నూతక్కివేణు తదితరులు పాల్గొన్నారు.  

Back to Top