ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించండి

బిజెపి, టిడిపిలు ఒకరిపై ఆరోణలు తప్పతే,
అవినీతి అక్రమాలపై విచారణ జరిపించడానికి వెనకంజ వేస్తున్నాయని వైయస్ ఆర్ కాంగ్రెస్
సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలున్నాయని చెపుతున్న బిజెపి నాయకులు, కేంద్ర
ప్రభుత్వం చేత సిబిఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర
ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి పార్లమెంటులో నిలదీయాలని, రాష్ట్ర ప్రభుత్వంలో ఆవినీతి
పై సిబిఐ విచారణకు బిజెపి వత్తిడి తెచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోకుంటే,
వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయన్న విషయం స్పష్టం
అవుతుందన్నారు. 

Back to Top