ప్రజాసమస్యలపై నిలదీయనున్న ప్రతిపక్షం

హైదరాబాద్ః ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజులపాటు ఏపీ అసెంబ్లీ  శీతాకాల సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ఎండగట్టేందుకు సిద్ధమైంది. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకపోగా, 18 నెలల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారు. విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతూ  టీడీపీ నేతలు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే అసెంబ్లీలో  ప్రజాసమస్యలు, పాలకపక్షం అవినీతి, అక్రమాలను నిలదీసేందుకు  వైఎస్సార్సీపీ సమాయత్తమవుతోంది. 

అసెంబ్లీలో చర్చకు తావు లేకుండా చంద్రబాబు సమావేశాలను తూతుమంత్రంగా నిర్వహిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. కనీసం 15 రోజులైనా సమావేశాలు కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసినా పచ్చసర్కార్   ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే  చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను ఆరురోజుల్లో ముగించేందుకు ప్లాన్ వేశారని  ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. 
Back to Top