విభజనను అడ్డుకునే శక్తి వైయస్ జగన్‌కే ఉంది

ఏలూరు‌, 9 నవంబర్ 2013:

రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వకుండా పోరాడే శక్తి వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని పార్టీ నాయకులు తెల్లం బాలరాజు, రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శనివారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఆశయ‌ సాధన కోసం శ్రీ జగన్ నాయకత్వంలో‌ అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామన్నారు. ఆ మహానేత లక్షణాలను శ్రీ జగన్ పుణికి పుచ్చుకున్నారని తెలిపారు. సమైక్యాంధ్రప్రదే‌శ్కు‌ శ్రీ వైయస్ జగన్‌ను సీఎం చేద్దామని సీమాంధ్ర ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించి అయినా సరే సమైక్యాంధ్రను సాధించుకుందామని అన్నారు.

Back to Top