నిరవధిక నిరాహార దీక్షలో విజయమ్మ ఒక్కరే

విజయవాడ :

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న నిరంకుశ ధోరణికి నిరసనగా విజయవాడలో ఈ నెల 19 ఉదయం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. శ్రీమతి విజయమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే శ్రీమతి విజయమ్మ మాత్రమే దీక్ష చేస్తారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేయొచ్చని సూచిస్తున్నారు. వర్షం వల్ల దీక్షా శిబిరంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాటర్ ప్రూ‌ఫ్ షామియానా‌లు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీమతి విజయమ్మ దీక్ష చేపట్టే ప్రాంతాన్ని శుక్రవారంనాడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, పార్టీ కార్యక్రమాల కమిటి కన్వీనర్ తలశిల రఘురాం, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,‌ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ ‌నగర కన్వీనర్ జలీ‌ల్‌ఖాన్, నియోజకవర్గం ఇన్‌చార్జిలు పేర్ని వెంకట్రామయ్య (నాని), జోగి రమేశ్, వంగవీటి రాధాకృష్ణ, పూనూరు గౌతంరెడ్డి, పడమటి సురేష్‌బాబు, తాతినేని పద్మావతి, నాయకులు అడుసుమిల్లి జయప్రకాశ్, రాజ్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు.

తాజా ఫోటోలు

Back to Top