మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్‌

ఢిల్లీ: ప్రత్యేక హోదాపై చర్చ జరపాలంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి కేంద్రానికి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసింది. నిన్న ఇచ్చిన నోటీసుపై చర్చ జరపాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ఇవాళ ఉదయం స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సభ్యుల ఆందోళన మధ్య వాయిదా పడిన సభ తిరిగి 12 గంటలకు వాయిదా పడగా, వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసు అందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయితే ఇతర రాష్ట్రాల ఎంపీలు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టడంతో సభ ఆర్డర్‌లో లేదంటూ సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు.
  
 
Back to Top