ఎడారిలో ఒయాసిస్‌లా కేంద్ర బడ్జెట్‌

హైదరాబాద్‌: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎడారిలో ఒయాసిస్‌లా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసిన ప్రధాన మంత్రి నాకు 60 రోజులు సమయం ఇవ్వండి పేద, మధ్య తరగతి ప్రజానికానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశ కల్పించి నట్టేట ముంచారని విమర్శించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. ఈ సందర్భంగా బడ్జెట్‌లో ఎక్కడా కూడా పేదవారికి, వ్యవసాయరంగానికి ఏ మేలు లేకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రైతుకు పూర్తిగా నిరాశ కల్గించే బడ్జెట్‌ అని దుయ్యబట్టారు. రైతులకు ఆర్థిక మంత్రి కనీసం వడ్డీలేని రుణాలు ఇస్తామని, దివంగత మహానేత వైయస్‌ఆర్‌లా పావలా వడ్డీలు ఇస్తామని చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీ అన్యాయంగా విభజనించ బడింది. ఆర్థికంగా వెనుకబడిందనే ధ్యాస ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందనేది బడ్జెట్‌ చూస్తే కనిపించడం లేదు.

Back to Top