'న్యూట్రిన్'లో వైయస్‌ఆర్‌ టియుసి జయకేతనం

తిరుపతి : చిత్తూరులోని న్యూట్రిన్ కన్ఫెక్షనరీ కంపెనీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ప్రభంజనం వీచింది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం వై‌యస్‌ఆర్ ‌టియుసి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీ జగన్ నాయకత్వం మీద కార్మికులకు సైతం ఉన్న అచంచల విశ్వాసం, దివంగత‌ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మీద వారికి ఉన్న అనిర్వచనీయమైన అభిమా‌నం ఈ ఎన్నిక సందర్భంగా మరోసారి స్పష్టమయ్యాయి. కొత్త సంవత్సరం తొలి రోజుల్లో జరిగిన ట్రేడ్ యూనియ‌న్ ఎన్నికల్లో కార్మికులు వైయస్‌ఆర్‌సిపికి తొలి విజయం అందించారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సోమవారం ‌నాడే ఈ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికలో 487 మంది కార్మికులకు గాను, 486 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. రెండు ఓట్లు చెల్లలేదు. ఇందులో వైయస్‌ఆర్‌ టియుసి ప్యానెల్‌కు 277 ఓట్లు పోలయ్యాయి. ఐఎన్‌టియుసికి 186 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఐఎన్‌టియుసి మీద వైయస్‌ఆర్‌ టియుసి 91 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ఇప్పటి వరకూ కర్మాగారంలో చక్రం తిప్పిన టిఎన్‌టియుసి కేవలం 21 ఓట్లు మాత్రమే తెచ్చుకుని ఘోర పరాజయాన్ని చవిచూసింది. దశాబ్దాలుగా గుర్తింపు కార్మిక సంఘాలుగా ఒక వెలుగు వెలిగిన ఐఎన్‌టియుసి, టిడిపి అనుబంధ విభాగం టిఎన్‌టియుసిని తొలి ప్రయత్నంలోనే వైయస్‌ఆర్‌టియుసి చిత్తుచేసింది.
Back to Top