ఫిరాయింపుదారులకు కోర్టు నోటీసులు శుభపరిణామం

విజయవాడ:

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం శుభ పరిణామమని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని ప్రతిపక్షం ఎన్నిసార్లు ప్రశ్నించినా ఎవరూ పట్టించుకోలేదని, ఫిరాయింపు దారులపై స్పందించాలని స్పీకర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. హైకోర్టు తీర్పుపై విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావులు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కోర్టు నుంచి వచ్చిన నోటీసులు తీసుకొని గవర్నర్‌ దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరాలన్నారు. కోర్టు మరో రెండు వారాల్లో ఫిరాయింపుదారులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే స్పీకర్‌ తన పదవిని మర్చి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. Back to Top