వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాదుహైద‌రాబాద్‌) వైఎస్ఆర్సీపీ నాయ‌కుల మీద వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాద‌ని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్య‌క్షుడు నాగిరెడ్డి అన్నారు. పార్టీ నిర్వ‌హించిన సేవ్ డెమొక్ర‌సీ విజ‌య‌వంతం కావ‌టంతో టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు వ్యక్తిగత దూషణలతో అడ్డగోలుగా విమర్శిస్తున్నారని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్టు విమర్శించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఫిరాయింపుల‌కు సంబంధించి మేం అన్ని ప్రాంతాల్లో ఒక‌టే విధానం అనుస‌రిస్తున్నాం. కానీ టీడీపీ మాత్రం రెండు నాలుక‌ల విధానం అనుస‌రిస్తోంది. తెలంగాణ లో ఫిరాయింపుల మీద గ‌గ్గోలు పెడుతున్న టీడీపీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మాత్రం ప్రోత్స‌హిస్తోంది. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబే స్వ‌యంగా నాయ‌కుల‌కు పార్టీ కండువాలు క‌ప్పి ఆహ్వానిస్తున్నారు. ఇదేమి విధానం అని సూటిగా నిల‌దీశారు. 
 ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షలాది మంది రైతులు వలసబాట పట్టారని చెప్పారు. క‌రువుతో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నార‌ని ఆయ‌న అన్నారు. కానీ, పారిశ్రామిక వేత్త‌ల‌కు ఎర్ర తివాచీ ప‌రుస్తున్న చంద్రబాబు ప్ర‌భుత్వం, రైతుల పట్ల నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని మండిప‌డ్డారు. క‌మీష‌న్ల‌కు ఆశ ప‌డి పారిశ్రామిక‌దారుల‌కు స‌బ్సిడీలు ఇస్తున్నార‌ని, రైతుల‌కు మాత్రం ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొట్టేందుకు మార్గాలు వెదుకుతున్నార‌ని అన్నారు. చంద్రబాబు ప్ర‌భుత్వ తీరు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. 

To read the same article in English: http://bit.ly/1Ts8Fq4 

Back to Top