16న వైయస్ఆర్ కాంగ్రెస్ 'ఉత్తరాంధ్ర' సమావేశం

విజయనగరం 14 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల నేతల విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 16న విజయనగరంలో నిర్వహించనున్నట్లు బొబ్బిలి తాజా మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ఈ ప్రాంతీయ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రజల్లో ఎంత బలం ఉంది అనేది ఎన్నికలు నిర్వహిస్తే వైయస్ఆర్‌ కాంగ్రెస్ నిరూపించుకుంటుందని చెప్పారు. సభ్యత్వ నమోదు ఒక డెడ్‌లైన్ విధించి గడువులోగానే పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఒకరికంటే ఎక్కువ ఉండటం ఇబ్బందేమీకాదని వైయస్ఆర్‌ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెన్మెత్స సాంబశివ రాజు చెప్పారు. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సదస్సుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.

పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత బలోపేతమవుతుందని పార్టీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు సుజయకృష్ణ రంగారావు విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జూన్ 16 తేదిన పార్టీ శ్రేణులకు పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ దశాదిశా నిర్దేశకత్వం చేస్తారని తెలిపారు. తమను అనర్హులుగా ప్రకటించాలని  ఏడాదిగా కోరుతున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదనీ, ఇప్పుడు పథకం ప్రకారమే అనర్హత వేటు వేసిందని ఆయన మండిపడ్డారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన 15 మంది కాంగ్రెస్‌-టీడీపీ ఎమ్మెల్యేలు హీరోలన్నారు.

Back to Top