ఏం ఉద్ధరించారని మహానాడులు

అనంతపురంః తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం ఉద్దరించారని మినీ మహానాడులు జరుపుకుంటున్నారని వైయస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షులు గోపాల్ రెడ్డి నిలదీశారు. మినీ మహానాడుల పేరుతో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత స్వామిరెడ్డితో కలిసి గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మినీ మహానాడుల పేరుతో టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకోవాలో ప్రణాళికలను రూపొందించుకుంటున్నారని ఆరోపించారు. మహానాడులో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించకుండా ..ప్రతిపక్ష నేతపై మాటల దాడి చేయడం నీచమన్నారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.  

తాజా వీడియోలు

Back to Top