29 మంది చనిపోయినా ముఖ్యమంత్రిని విచారించరా..?

హైదరాబాద్ః రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది నిధులు లేవంటూనే, మరో పక్క విచ్చలవిడిగా టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే...కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాకముందే విజయవాడలో 30 ఆలయాలను కూల్చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనకు సంబంధించి కమిషన్ ఇంతవరకు ముఖ్యమంత్రిని విచారించకపోవడం దారుణమన్నారు. పుష్కరాల పేరుతో వందల కోట్లు లూటీ చేస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు.  

Back to Top