చిత్తశుద్ధి లేని ప్రభుత్వం..మేరుగ

హైదరాబాద్) రాజధాని ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపు మీద ప్రభుత్వానికి
చిత్తశుద్ది లేదని వైయస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు డాక్టర్ మేరుగ నాగార్జున
మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో
మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం హడావుడిగా
ప్రకటించి వాయిదా వేసుకోవటంపై ఆయన మండిపడ్డారు. 
 భూములు లాక్కునేటప్పుడు చాలా
హామీలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం అవేమీ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానిలో గ్రామకంఠాల గురించి అసైన్డ్ భూముల గురించి ఏమీ చెప్పకుండానే
భయపెడుతున్నారని పేర్కొన్నారు. దళితుల భూముల మీద కూడా దోబూచులాడుతున్నారని మేరుగ
నాగార్జున మండిపడ్డారు.

 

Back to Top