వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే..!

మోసం మోసం అన్న విధానాల‌తోనే అధికారం
ప్ర‌జ‌ల్ని మోస‌గించిన ప్ర‌భుత్వం
రానున్న‌ది మ‌న‌స్సు ఉన్న ప్ర‌భుత్వం
అప్పుడు అంద‌రికీ న్యాయం

మ‌చిలీప‌ట్నం: రాష్ట్ర ప్ర‌జ‌ల్ని మోస‌గించి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చార‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ మండి ప‌డ్డారు. త్వ‌ర‌లోనే మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుందని, మాటల్ని నిల‌బెట్టుకొనే ప్ర‌భుత్వం అవుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. కృష్ణా జిల్లా ముఖ్య‌కేంద్రం మ‌చిలీప‌ట్నంలో ఆయ‌న ధ‌ర్నా నిర్వ‌హించి, స్థానికుల్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. కొత్త‌మాజేరు గ్రామంలో విష‌జ్వ‌రాల బారిన ప‌డి దాదాపు 20 మంది దాకా చ‌నిపోతే, ప్రభుత్వం ప‌ట్టించుకోనందుకు నిర‌స‌న‌గా ఆయ‌న ఈ ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు పాల‌న తీరుని తూర్పార ప‌ట్టారు.

త‌ప్పు ప్ర‌భుత్వానిదే..!
కొత్త మాజేరు గ్రామంలో నీటి కాలుష్యంతో స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయ‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. సుర‌క్షిత తాగునీటిని అందించాల్సిన బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేదని ఆయ‌న అన్నారు. వ‌రుస‌గా మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నా, ప్ర‌భుత్వ యంత్రాంగంలో చ‌ల‌నం లేద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా తాను అక్క‌డ‌కు వెళ్లి ప‌రిస్థితుల్ని స‌మీక్షించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇంత జ‌రిగినా ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసిందని ఆయ‌న అన్నారు.

మోసమే విధానం
డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ అని చెప్పి మోస‌గించార‌ని, ఉద్యోగం పేరుతో పిల్ల‌లు త‌ల్లిదండ్రుల్ని మోస‌గించావ‌ని వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణా డెల్టా రైతుల‌కు నీరు లేక పంట‌లు పండించుకోలే పోతున్నార‌ని గుర్తు చేశారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక క‌ర‌వు త‌ప్ప మ‌రే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు ఎన్ని బాధ‌లు ప‌డుతున్నా ప‌ట్టించుకోవ‌టం లేదని ఆయ‌న అన్నారు. 

రానున్న రోజులు మ‌న‌వే..!
చంద్ర‌బాబు ఎక్కువ రోజులు ప‌నిచేయ‌ర‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే అని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌భుత్వానికి మ‌నస్సు లేద‌ని ఆయ‌న అన్నారు. వ‌చ్చేది మాత్రం మ‌నసున్న ప్ర‌భుత్వం అని, మోసం చేయ‌ని ప్ర‌భుత్వం అని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఆత్మీయంగా వైఎస్ జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగానికి జ‌నం క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో సంఘీభావం ప్ర‌క‌టించారు. 
Back to Top