తెలంగాణ విద్యార్థి విభాగంలో నూతన నియామకాలు

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగంలో  పలువురి నియామకాలు జరిగాయి. వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్‌చారి ఈ నియామకాలు చేశారు. రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులుగా ఎం.కౌటిల్‌రెడ్డి, ఏనుగుల సందీప్‌రెడ్డి, కార్యదర్శులుగా షేక్‌ మీరావలి, జిల్లాల సుధాకర్, ఎం.శివశంకర్‌రెడ్డి, ఎం.అరవింద్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా పి.సంతోష్‌కుమార్, కేతావత్‌ శ్రీకాంత్, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీలుగా జి.వినోద్‌రెడ్డి, ఎన్‌.విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పి.నాగార్జున నియమితులయ్యారు.

12 జిల్లాలకు అధ్యక్షులు
ఇక 12జిల్లాల్లో పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులను కూడా నియమించారు. ఆదిలాబాద్‌కు వై.రాజశేఖరరెడ్డి, ఓగ్గు మహేశ్‌చంద్ర (రాజన్న సిరిసిల్ల), గొల్లపల్లి ప్రసాద్‌ (మంచిర్యాల), వి.అక్షయ్‌ (కరీంనగర్‌), కుక్కల నాగేశ్వరరావు (ఖమ్మం), గుల్లగట్లు శ్రీకర్‌–పఠాన్‌ (మహబూబాబాద్‌), కె.సాయిచందర్‌రెడ్డి (సంగారెడ్డి), డి.రాహుల్‌గౌడ్‌ (రంగారెడ్డి), వి.ప్రవీణ్‌కుమార్‌ (మహబూబ్‌నగర్‌), కె.యోగేశ్వర్‌ (నిర్మల్‌), ఎండీ సిరాజుద్దీన్‌ (నల్లగొండ), బి.మహేందర్‌ (జనగాం)లను నియమిం చారు. ఇక మేడ్చల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా చంద్రగౌడ్, వి.నవీన్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులుగా అఖిల్‌చారి, డి.వేణుప్రసాద్‌గౌడ్‌లను నియమిం చారు.

Back to Top