పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకోం

హైదరాబాద్ః భూములను దోచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని అధికార టీడీపీని నిలదీశారు. అభివృద్ధి పేరుతో పేదల కొడుపు కొడితే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రైతులకు ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు అండగా ఉండడం కోసం వైయస్ జగన్ వస్తున్నారని తెలిసి టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని పార్థసారథి ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేత వస్తుంటే మీకెందుకు దడ పుడుతుందో సమాధానం చెప్పాలన్నారు. 

Back to Top