నారా వారి సారా స్రవంతి పథకం

శ్రీకాకుళం: రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఏకైక వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని వైయస్సార్‌సీపీ హైపవర్‌ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జరిగిన వైయస్సార్‌సీపీ ప్లీనరీలో మాట్లాడుతూ..కలెక్టర్‌, ఎస్పీ వ్యవస్థలు ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...మద్యం షాపులను వాడవాడలా తెరిచి నారా వారి సారా స్రవంతి పథకం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అది తన గొంతు కాదని కాణిపాకం వినాయకుని పై ప్రమాణం చేయగలరా...! అని సూటిగా ప్రశ్నించారు. మీ మ్యానిఫెస్టోపై చర్చకు రాగలరా...వైయస్ఆర్ సీపీ సామాన్య కార్యకర్తకు సమాధానం చెప్పగలరా..అని ప్రశ్నించారు.

Back to Top